అంతర్జాతీయ కెరీర్ లో ఒక్కసారి కూడా నో-బాల్ వేయని ఐదుగురు బౌలర్లు వీరే…!

-

క్రికెట్ అంటేనే ఊహించని పరిణామాలు ఎన్నో జరుగుతాయి. ప్రతి సింగిల్ బాల్ కూడా చాలా ముఖ్యం. కానీ ఒక్క బాల్ అటు ఇటుగా ఉన్న గేమ్ చేంజ్ అయిపోతుంది. ఒకవేళ కనుక బౌలర్ బాల్ వేసేటప్పుడు గీతని కొద్దిగా దాటిన దాని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

ఏది ఏమైనా ICC నో-బాల్ లో కొన్ని కొత్త రూల్స్ ని తీసుకుని వచ్చింది. దీనితో బ్యాట్స్మెన్ కి ఫ్రీ హిట్ లభిస్తుంది. అయితే కొంతమంది ప్లేయర్స్ ఇప్పటి వరకూ నో బాల్ ని తమ కెరియర్లో ఒక్కసారి కూడా వేయ లేదట. మరి ఆ బౌలర్ల గురించి ఈరోజు మనం చూద్దాం…!

లాన్స్ గిబ్స్

లాన్స్ గిబ్స్ వెస్టిండీస్ లెజెండ్. 79 టెస్టులు, 3 వన్డేలు ఆడాడు. టెస్ట్ క్రికెట్ చరిత్ర లో 300 వికెట్ల మార్కును చేరుకున్న తొలి స్పిన్నర్ ఇతనే. ఎప్పుడూ కూడా ఈ ఆటగాడు నో-బాల్ వెయ్యలేదు.

ఇయాన్ బోతం

ఇంగ్లండ్‌కు చెందిన గొప్ప ఆల్ రౌండర్ ఆటగాడు ఇయాన్ బోథం. ఈ ఆటగాడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించాడు. తన 16 సంవత్సరాల క్రికెట్ కెరీర్‌లో ఈ ఆటగాడు ఒక్క నో బాల్ ని కూడా వేయలేదు. ఇంగ్లాండ్ తరఫున ఏకంగా 102 టెస్టులు, 116 వన్డేలు ఆడాడు ఇయాన్ బోతం.

ఇమ్రాన్ ఖాన్:

ఇమ్రాన్ ఖాన్ ప్రపంచంలోని ఉత్తమ బౌలర్లలో ఒకడు. 88 టెస్టులు, 175 వన్డే మ్యాచ్‌లు ఆడాడు తన కెరీర్ మొత్తంలో, ఇమ్రాన్ ఎప్పుడూ నో బాల్ వెయ్యలేదు.

డెన్నిస్ లిల్లీ:

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఇతను. అత్యంత క్రమశిక్షణ గల ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ . అంతర్జాతీయ కెరీర్‌లో ఎప్పుడూ నో-బాల్ వెయ్యలేది. 70 టెస్టులు, 63 వన్డే మ్యాచ్‌లు ఆడాడు.

కపిల్ దేవ్:

మొత్తం 131 టెస్టులు మరియు 225 వన్డే మ్యాచ్‌లు ఆడాడు, కానీ అతని కెరీర్‌లో ఎప్పుడూ నో-బాల్ ని వెయ్యలేదు.

Read more RELATED
Recommended to you

Latest news