ఇండస్ట్రీలో మరో విషాదం : ప్రముఖ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ తమిళ దర్శకుడు, తన సినిమాల తెలుగు డబ్బింగ్ తో తెలుగు వారికి సుపరిచితుడైన కేవీ ఆనంద్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు.  గుండెపోటుతో ఆయన మరణించారని తేలుతోంది. ఇప్పటికే వరుసగా సినిమా పరిశ్రమ వారిని కోల్పోతుండగా తాజా మృతి అందరికీ దిగ్భ్రాంతి కలిగించింది.

సూపర్ హిట్ చిత్రాలు ప్రేమదేశం, ఒకే ఒక్కడు, శివాజీ తదితర చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఆయన ఆపై సూర్యతో అయాన్ (తెలుగులో వీడొక్కడే) సినిమాకి దర్శకత్వం వహించి, డైరెక్టర్ గా మారారు. ఆ పై జీవా హీరోగా కో (తెలుగులో రంగం)తో ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత సిద్దం అయ్యాడు. తర్వాత మాట్రాన్ (తెలుగులో బ్రదర్స్), ఆనేగన్ (తెలుగులో అనేకుడు), ఇక కాప్పాన్ (బందోబస్త్) సినిమాలకు దర్శకత్వం వహించారు. పీసీ శ్రీరామ్ శిష్యుడిగా పలు సినిమాలకు సినిమాటోగ్రఫీని అందించి, ఆపై దర్శకుడిగా మారారు.