ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. విలువ రూ.5కోట్లు

-

మరో డ్రగ్స్‌ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. రోజూ లక్షలు, కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ పట్టుబడుతున్నాయి. అయినప్పటికీ స్మగ్లర్లు మాత్రం వెనకాడకుండా.. మళ్లీ మళ్లీ డగ్స్‌ సరఫరా వైపే అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా.. ఢిల్లీ పోలీసులు భారీ డ్ర‌గ్ రాకెట్‌ను భ‌గ్నం చేశారు. మ‌హ‌దేవ్‌చౌక్ షాబాద్‌లో డ్ర‌గ్స్ త‌ర‌లిస్తున్న నిందితుడిని (57) అరెస్ట్ చేసి రూ 5 కోట్ల విలువైన రెండు కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్‌కు చెందిన రాజీవ్ గుప్తాగా గుర్తించారు.

నిందితుడి క‌ద‌లిక‌ల‌పై విశ్వ‌స‌నీయ స‌మాచారం ఆధారంగా నార్కోటిక్స్ సెల్ రాజీవ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నామ‌ని డీపీపీ ఔట‌ర్ నార్త్ బీకే యాద‌వ్ పేర్కొన్నారు. డ్ర‌గ్స్ ముడిప‌దార్ధాల స‌ర‌ఫ‌రాలోనూ నిందితుడు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని వైల్ల‌డైంద‌న్నారు పోలీసులు. నిందితుడు డ్ర‌గ్స్‌ను జార్ఖండ్‌, గ్వాలియ‌ర్ నుంచి తీసుకొచ్చి యూపీ, ఢిల్లీలో స‌ర‌ఫ‌రా చేస్తున్నాడ‌ని ప్రాధ‌మిక ద‌ర్యాప్తులో తెలిసిందని వెల్ల‌డించారు. డ్ర‌గ్స్ మూలాల‌తో సంబంధం ఉన్న వారితో పాటు ఇత‌ర నిందితులు, క్ల‌యింట్ల‌ను అరెస్ట్ చేసేందుకు నిందితుడి వాట్సాప్ కాల్ రికార్డ్స్‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version