5 రాష్ట్రాల ఎలక్షన్ రిజల్ట్స్: పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ దూకుడు

-

దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ పై ప్రజలు ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అందరి చూపు ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఉంది. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో అని అంతా ఎదురుచూస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. మొదటగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. 

ఇదిలా ఉంటే పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లో ర్యాపిడ్ గా స్థానాలను పెంచుకుంటూ పోతోంది బీజేపీ. తరవాతి స్థానంలో సమాజ్ వాదీ పార్టీ ఉంది. యూపీలో మొత్తం 403 స్థానలకు గానూ ప్రస్తుతం బీజేపీ పార్టీలో 41 స్థానాల్లో బీజేపీ, 27 స్థానాల్లో ఎస్పీ ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 17 స్థానాల్లో బీజేపీ, 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రంలో 10 స్థానాల్లో ఆప్, 8 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. గోవాలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. రానున్న మరోగంటలో ఆధిక్యాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news