ఉక్రెయిన్‌కు బ్రిట‌న్ సాయం.. ఆయుధాలు స‌ర‌ఫ‌రా

-

ఉక్రెయిన్ పై ర‌ష్యా సైనిక చ‌ర్య ఇంకా ఆగ‌డం లేదు. యుద్ధం ప్రారంభం అయి.. 2 వారాలు గ‌డుస్తున్నా.. ర‌ష్యా వెన‌కడుగు వేయడం లేదు. ప‌లు దేశాలు అంత‌ర్జాత‌యంగా ఆంక్షలు విధిస్తున్నా.. ర‌ష్యా త‌న యుద్ధాన్ని ఆప‌డం లేదు. కాగ భారీ స్థాయిలో మిసైల్స్, బాంబు దాడులతో ఉక్రెయిన్ పై ర‌ష్యా విర‌చుకుప‌డుతుంది. దీంతో ఉక్రెయిన్ కుదేలు అవుతుంది. ప్ర‌పంచ దేశాల సాయం కోసం వేచి చూసిన ఉక్రెయిన్ కు నిరాశే ద‌క్కుతుంది.

కాగ తాజా గా బ్రిట‌న్ మ‌రోసారి ఉక్రెయిన్ కు అండ‌గా నిలిచింది. ఇప్ప‌టి కే బ్రిట‌న్.. ప‌లు సార్లు ఆయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేసింది. తాజా గా మ‌రోసారి బ్రిట‌న్ త‌మ ఆయుధాల‌ను ఉక్రెయిన్ ను స‌ర‌ఫ‌రా చేసింది. యుద్ధ కాలంలో ఉక్రెయిన్ కు బ్రిట‌న్ అండ‌గా ఉంటూ వ‌స్తుంది. కాగ బ్రిట‌న్.. ఉక్రెయిన్ – ర‌ష్యా యుద్ధం మొద‌టి నుంచి ఉక్రెయిన్ వైపే ఉంటుంది.

ఉక్రెయిన్ మ‌ద్ద‌తు తెలుపుతూ.. ర‌ష్యా పై ఆంక్షలను కూడా విధిస్తుంది. ఇటీవ‌లే ర‌ష్యా చ‌మురు దిగుమ‌తుల‌పై కూడా బ్రిట‌న్ బ్యాన్ విధించింది. అంతే కాకుండా రష్యా కు వ్య‌తిరేకంగా ఒక కుట‌మీ ఏర్పాటు చేయాల‌ని కూడా బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి బోరిస్ జాన్స‌న్ అంటున్నారు. దీని కోసం ప‌లు దేశాల‌తో కూడా చర్చ‌లు జ‌రుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news