కోచింగ్‌ తీసుకుంటున్న నిరుద్యోగులకు నెలకు రూ.5 వేలు – తలసాని

-

ఉచిత కోచింగ్ లో ప్రతి అభ్యర్ధికి నెలకు 5 వేల రూపాయలు చొప్పున చెల్లిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటన చేశారు. పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధుల కోసం నియోజకవర్గం కు ఒకటి చొప్పున ఉచిత కోచింగ్ సెంటర్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ నెల 9 న హైదరాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో మన బస్తి –మన బడి పనుల ప్రారంభం చేస్తున్నామన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మన బస్తి – మన బడి కార్యక్రమం అమలుపై హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి సమీక్ష నిర్వహించారు మంత్రి తలసాని.

ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, MLC లు, MLA లు, కలెక్టర్, విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని.. రాష్ట్ర వ్యాప్తంగా 26,065 పాఠశాలలను గుర్తించి 7,289.54 కోట్ల రూపాయలను కేటాయించిందని పేర్కొన్నారు.

హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతగా 239 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందన్నారు మంత్రి తలసాని. గత ప్రభుత్వాలు విద్యారంగ అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారం గురించి పట్టించుకోలేదని.. రానున్న రోజులలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నట్లు చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news