చాలామంది వెండి వస్తువులని శుభ్రం చేయడానికి ఎంతో కష్ట పడుతుంటారు. నిజానికి రోజూ పెట్టే దీపం కుందులు కాళ్ల పట్టీలు ఇవన్నీ కూడా బాగా నల్లగా ఉంటుంటాయి. వీటిని తెల్లగా మార్చడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. మీరు కూడా వీటిని తోమడానికి కష్టపడుతున్నారా అయితే ఈ టెక్నిక్స్ ని ఫాలో అవ్వండి. వీటిని అనుసరిస్తే వెండి ఆభరణాలు శుభ్రం చేయడం ఈజీగా ఉంటుంది పైగా ఇవి మెరిసిపోతాయి. మరి ఇక ఈ టెక్నిక్స్ ని చూసేద్దాం.
బేకింగ్ సోడా అల్యూమినియం ఫాయిల్:
మీ వెండి ఆభరణాలు, వెండి వస్తువులు పసుపు రంగులో కానీ నల్లని రంగులో కానీ మారినట్లయితే సింపుల్ గా ఈ చిట్కాని ట్రై చేయండి. దీనితో తెల్లగా మెరిసిపోతాయి. 30 సెకండ్ల నుండి మూడు నిమిషాలు లోగా మీ వెండి వస్తువులు తెల్లగా మారిపోతాయి. ముందు ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకుని అందులో నీళ్లు పోయండి. పొడి అంతా కరిగే వరకు ఉంచి తర్వాత అల్యూమినియం ఫాయిల్ తో రుద్దండి. అల్యూమినియం ఫాయిల్, బేకింగ్ సోడా తో మీరు మీ వండి వస్తువులను క్లీన్ చేస్తే సులభంగా శుభ్రం చేసేయొచ్చు. పైగా తక్కువ టైంలోనే తెల్లగా మెరిసిపోతాయి.
నిమ్మ, ఉప్పు:
మూడు టేబుల్ స్పూన్స్ సాల్ట్ తీసుకుని.. నిమ్మ రసం, కొంచెం వేడి నీళ్లు తీసుకోండి. ఇందులో వెండి వస్తువులని ఉంచండి ఆ తర్వాత మామూలు నీళ్లతో క్లీన్ చేయండి అంతే సరిపోతుంది ఈజీగా వెండి వస్తువులు తెల్లగా మారుతాయి.
టమాట కెచప్:
దీనితో కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. వెండి సామాన్ల మీద 15 నుండి 20 నిమిషాల పాటు టమాట కెచప్ ని వేసి ఉంచండి. తర్వాత క్లాత్ తో క్లీన్ చేసుకోండి.
టూత్ పేస్ట్:
టూత్ పేస్ట్ కూడా బాగా పనిచేస్తుంది. టూత్ పేస్టు కూడా మీరు వెండి వస్తువుల్ని క్లీన్ చేసుకోవచ్చు. పేస్ట్ ని మీ వెండి సామాన్లకి అప్లై చేసి ఐదు నిమిషాలు వదిలేసి తర్వాత నీళ్లతో క్లీన్ చేసుకోండి.
వెనిగర్:
అరకప్పు వెనిగర్ లో రెండు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి గోరువెచ్చని నీళ్లు అందులో పోసి తర్వాత మూడు గంటల పాటు మీ వెండి వస్తువులని ఉంచండి. ఆ తర్వాత చల్లని నీళ్లతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.