రూ.5 లక్షలలో దొరికే 5 రకాల కార్లు.. మైలేజీ అదుర్స్..!

-

మధ్య తరగతి కుటుంబాలకు కారు కొనాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. కారు కొనాలని అనుకున్నప్పుడు మనసులో ఎన్నో రకాల ప్రశ్నలు మెదులుతుంటాయి. ఎంత బడ్జెట్‌లో కారు దొరుకుతుంది. కారు మైలేజీ ఎంత ఇస్తుంది. సౌకర్యంగా ఉంటుందా.. అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో తలెత్తుతాయి. అయితే అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఈ 5 కార్ల గురించి చెప్పబోతున్నాం. రూ.5 లక్షల బడ్జెట్‌లో దొరికే కార్ల గురించి తెలుసుకుందాం రండి.

alto
alto

మారుతి ఆల్టో..
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే కార్లలో మారుతి ఆల్టో ఒకటి. ఇది ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు. దీని ఎక్స్‌షోరూం ధర రూ.2.99 లక్షల నుంచి రూ.4.48 లక్షల మధ్య ఉంటుంది. 22.05 పెట్రోల్ సామర్థ్యంతో.. లీటరుకు 31.59 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

preeso
preeso

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో..
మారుతి సుజికి చెందిన ఎస్-ప్రెస్సో కారు తక్కువ ధరలో అందుబాటులో వచ్చింది. దీని ప్రారంభ ధర రూ.3.70 లక్షలు. పెట్రోల్ మైలేజీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎస్టీడీ, ఎల్ఎక్స్ఐ వేరియంట్లలో 21.4 కిలోమీటర్ల మైలేజీ, వీఎక్స్ఐ, వీఎక్స్ఐ వేరియంట్లలో 21.7 కిలోమీటర్ల మైలేజీ లభిస్తాయి. ఎస్-ప్రెస్సో సీఎన్‌జీ మోడల్ ప్రారంభ ధర రూ.4.84 లక్షలు ఉండగా.. ఇది లీటరుకు 31.2 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

హ్యుందాయ్ సాంట్రో..
భారతదేశంలో ఎంట్రీ లెవల్ కార్లకు పెద్ద మార్కెట్ ఉంది. ఈ ఎంట్రీ లెవర్ కార్ల విభాగంలో హ్యుందాయ్ ఫస్ట్ ప్లేస్. ఢిల్లీలోని సాంట్రో మొక్క ఎక్స్ షోరూం ధర రూ.4.67 నుంచి రూ.6.35 లక్షల మధ్య దీని ధర ఉంటుంది. ఈ కారు లీటరు పెట్రోల్‌కు 20.3 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. సీఎన్‌జీ సాంట్రో మోడల్ కారు 31.59 కి.మీ. మైలేజీ ఇస్తుంది.

రెనాల్ట్ క్విడ్..
తక్కువ ధరలో దొరికే కార్లలో రెనాల్ట్ క్విడ్ కూడా ఒకటి. దీని ప్రారంభ ధర రూ.3.12 లక్షల నుంచి రూ.5.31 లక్షల వరకు దొరుకుతుంది. దీని ఇంజిన్ ఎంపికలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి 0.8 లీటర్లు, 1.0 లీటర్లు. రెనాల్ట్ క్విడ్ లీటరుకు 22.3 కి.మీ మైలేజీ ఇస్తుంది.

టాటా టియాగో..
టాటా టియాగో అత్యంత సురక్షితమైన కారు. ఈ కారు మొక్క ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ 23.84 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఎక్స్‌షోరూంలో దీని ధర రూ.4.85 లక్షల నుంచి రూ.6.84 లక్షల వరకు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news