కరోనా లాక్‌డౌన్ ఎంతో మందిని తమ కుటుంబ సభ్యులకు దూరం చేసింది. లాక్‌డౌన్ వల్ల ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో తమ కుటుంబ సభ్యుల వద్దకు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఆ సమయం రానే వచ్చింది. దేశవ్యాప్తంగా రైళ్లు, బస్సులు, విమానాలు తిరిగేందుకు అనుమతినిస్తున్నారు. దీంతో దేశంలోని ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు ఎట్టకేలకు తమ సొంత ఊళ్లకు వెళ్తున్నారు. ఇక 5 ఏళ్ల వయస్సున్న ఓ బాలుడు ఎట్టకేలకు 3 నెలల అనంతరం తన కన్నతల్లి వద్దకు విమానంలో ఒంటరిగా ప్రయాణించి చేరుకున్నాడు.
బెంగళూరుకు చెందిన 5 ఏళ్ల విహాన్ శర్మ లాక్‌డౌన్ వల్ల ఢిల్లీలో చిక్కుకుపోయాడు. అయితే 3 నెలల అనంతరం ప్రస్తుతం విమానాలు నడుస్తుండడంతో అతను ఢిల్లీ నుంచి బెంగళూరుకు ఒంటరిగా విమానంలో ప్రయాణించి ఎట్టకేలకు కన్నతల్లి వద్దకు చేరుకున్నాడు. తన కుమారున్ని తీసుకెళ్లేందుకు ఆ మహిళ బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. ఆ సమయంలో వారిద్దరినీ తీసిన ఫొటోలు ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
Welcome home, Vihaan! #BLRairport is constantly working towards enabling the safe return of all our passengers. https://t.co/WJghN5wsKw
— BLR Airport (@BLRAirport) May 25, 2020
కాగా విమానాల్లో వచ్చే ప్రయాణికులు కేంద్రం సూచనల ప్రకారం 7 రోజుల పాటు తమ సొంత ఖర్చులతో క్వారంటైన్‌లో ఉండాలి. అదే 10 ఏళ్ల లోపు పిల్లలు, 80 ఏళ్ల వృద్ధులు అయితే ఇంట్లో క్వారంటైన్‌లో ఉండవచ్చు. కానీ వారికి తోడుగా వేరే ఎవరైనా పెద్దలు ఉండాలి.