‘బింబిసార’ ఓటీటీ రిలీజ్ తేదీ ప్రకటించిన దిల్ రాజు !

-

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బింబిసారా చిత్రం భారీ అంచనాల మధ్య ఆగస్టు 5న గ్రాండ్ గా రిలీజ్ అయింది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో కనిపించాడు. బింబిసార అనే రాజుగా తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడని టాక్ కూడా వినిపిస్తోంది.

టైం ట్రావెలర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటిటి రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ మూవీ కోసం పలు ఓటిటి సంస్థలు గట్టిగానే పోటీ పడ్డాయట.

చివరకు ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ జి5 బింబిసారాను భారీ ఒప్పందానికి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ పై దిల్‌ రాజ్‌ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. బింబిసార సినిమాను 50 రోజుల తర్వాతనే ఓటీటీలో రిలీజ్‌ చేస్తామని వెల్లడించారు. అప్పటి వరకు థియేటర్లలోనే ఉంటుందని చెప్పారు. ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌ ఓ క్రూరమైన రాజు పాత్రలో బాగా యాక్టింగ్‌ చేశారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news