మాంసం ప్రియులకు శుభవార్త.. ఏపీలో కిలో మటన్ రూ.50లే !

మాంసం ప్రియులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు వ్యాపారస్తులు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురం లో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. నిన్న సాయంత్రం వ్యాపారస్తులు పోటీపడుతూ ధరలను తగ్గించడంతో మటన్ ధర 50 రూపాయలకు అమ్ముడు పోయింది. దీంతో కొనుగోలు దారులు పోటీపడుతూ.. ఒక్కొక్కరు ఐదు కిలోల నుంచి 10 కిలోల వరకు మటన్ కొనుగోలు చేశారు. గాంధీ బస్టాండ్ వద్ద ఉన్న ఓ దుకాణదారుడు మొదట కిలో రేటు 300 బేరం సాగించాడు.

దీంతో ఇతర దుకాణదారులు కూడా పోటీపడి 200 నుంచి వంద రూపాయలకు తగ్గించేశారు. అలా అందరూ దుకాణాదారులు.. పోటీ పడడంతో కిలో మటన్ ధర 50 రూపాయలకు పడిపోయింది. దీంతో 7:30 సమయానికి… మటన్ షాపుల్లో ఉన్న స్టాక్ పూర్తయిపోయింది. దుకాణదారుల పోటీయే ధర తగ్గడానికి.. కారణంగా చెబుతున్నారు. ఇక అటు చికెన్ మాత్రం 160 రూపాయల చొప్పున అమ్మకాలు సాగాయి. అటు మటన్ కేవలం యాభై రూపాయలు… మాత్రమే ఉండటంతో.. ఎక్కువమంది చికెన్ కొనుగోలు చేయలేదు.