ఏపీలో 18,450 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం

-

బాబు వచ్చాడు..జాబు వచ్చింది అంటూ పెద్దఎత్తున ప్రచారం

ఏపీలో 18,450 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన ఉద్యోగాల్లో గ్రూప్-1, 2 , 3 పోస్టులు, పోలీసు పోస్టులు, ఉపాధ్యాయ పోస్టులతోపాటు.. ఇతర పోస్టులు ఉన్నాయి.  ఏపీపీఎస్సీ, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా సంబంధిత ఉద్యోగాల నియామకాలు  చేపట్టనున్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీని డీఎస్సీ ద్వారా చేపట్టనున్నారు. ఈ  ఏడాది చివరి నాటికి పోస్టుల భర్తీని పూర్తి చేయనున్నారు.

9,275 ఉపాధ్యాయ, పోలీసు శాఖ పరిధిలోని మూడువేల పోస్టులు మినహా మిగిలినవన్నీ కమిషన్‌ ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. వివిధ శాఖల్లో 20వేలకు పైగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెప్టెంబరు 18 గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో 18,450 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఇక ఏపీలో నిరుద్యోగులు ఉద్యోగసాధనే ధ్యేయంగా పరిశ్రమిస్తున్నారు. త్వరితగతిన పోస్టుల భర్తీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగార్థులు స్వాగతిస్తున్నారు.

పోస్టులు
పోస్టుల సంఖ్య
గ్రూపు-1 182
గ్రూపు-2 337
గ్రూపు-3 1670
హోంశాఖ 3000
వైద్యారోగ్య శాఖ 1604
లెక్చరర్స్ 725
ఉపాధ్యాయులు 9275
ఇతర శాఖల్లో ఖాళీలు 1657
మొత్తం పోస్టులు 18,450

 

ఈ పోస్టుల భర్తీ గురించి ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి…తెదేపా నేతలు ‘బాబు వచ్చాడు…జాబు ఇచ్చారు’ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం కొసమెరుపు.

Read more RELATED
Recommended to you

Latest news