బడుల మూసివేతకే 5,741 మంది టీచర్లు బదిలీ : హరీశ్ రావు

-

ప్రతీ చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్, ప్రతీ రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఏర్పాటు చేస్తామని అభయహస్తం మ్యానిపెస్టో లో ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ బడుల మూసివేత చర్యలు తీసుకుంటుందని మాజీ మంత్రి తన్నీర్ హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ముఖ్యంగా స్కూల్ పేరిట 1899 స్కూల్స్, 10 మంది లోపు విద్యార్థులు 4,314 స్కూల్స్ మొత్తం కలిపి 6,213 స్కూల్ శాశ్వతంగా మూసేసే ప్రణాళికలో భాగంగానే ఆ స్కూల్ లో పని చేసే 5741 మంది టీచర్లను బదిలీ చేస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు.

Harish Rao

కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం 7,289 కోట్లతో మన ఊరు-మన బడి, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం సన్నబియ్యంతో పౌష్టికాహారం అందించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చీ రాగానే సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ రద్దు చేసి మన ఊరు మన బడి ప్రోగ్రామ్ కొనసాగించకపోవడంతో పురుగుల అన్నం, విషాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం వల్ల ప్రభుత్వ పాఠశాల పరపతి తగ్గి ఎన్రోల్మెంట్ తగ్గుతుందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version