-

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’ . ఇక ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా గ్లింప్స్ను మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో నాని బర్త్ డే సందర్భంగా ఈ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసినట్లు ప్రకటించారు. ఈ సినిమా ఆగస్టు 29న రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు.

ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఎస్‍జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ  చిత్రం  ఫస్ట్ గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది . యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. గతంలో  నాని,వివేక్ కాంబినేషన్‍లో  వచ్చిన ‘అంటే సుందరానికి’ మూవీ కమర్షియల్‍గా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా.. మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది.మిగిలిన రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే శక్తిమంతుడిగా కనిపించే భిన్నమైన కథాంశంతో రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news