ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ అవేమి పట్టించుకోకుండా ఇష్టానుసారంగా రోడ్డుపై వెళ్తుండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులను తీసుకెళ్తున్న ఓ ట్రాక్టర్ కస్ గంజ్ వద్ద చెరువులో పడిపోవడంతో 15 మంది మరణించారు. మరికొందరూ గాయపడ్డారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, పలువురు చిన్నారులు ఉన్నారని.. యాత్రికులందరూ హరిద్వార్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీస్ విభాగానికి చెందిన ఉన్నతాధికారులతో పాటు పరిపాలన విభాగానికి చెందిన అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది మృతి చెందినట్టు అధికార యంత్రాంగం నిర్థారించింది. పాటియాలీలోని సీహెచ్ సీలో ఏడుగురు చిన్నారులు, ఎనిమిది మంది మహిలలు మరణించారని సీఎంఓ డాక్టర్ రాజీవ్ అగర్వాల్ వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.