సైకిల్ మీద బీహార్ టు ఢిల్లీ..శబాష్

-

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి బీహార్ సివాన్‌కు చెందిన సత్యదేవ్ మంజి అనే 60 ఏళ్ల వ్యక్తి గురువారం ఢిల్లీ – హర్యానా సరిహద్దులోని తిక్రీకి చేరుకున్నాడు. 11 రోజుల్లో దాదాపు 1,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని సైకిల్‌పై పూర్తి చేశాడు ఈ వ్యక్తి. ఇక అక్కడికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మంజి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

“నా సొంత జిల్లా సివాన్ నుండి ఇక్కడికి చేరుకోవడానికి నాకు 11 రోజులు పట్టింది. మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఉద్యమం ముగిసే వరకు నేను ఇక్కడే ఉంటాను” అని మంజి మీడియాకి చెప్పారు. కొత్తగా అమలులోకి వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు- రైతు ఉత్పత్తి వాణిజ్యం మరియు ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ చట్టాలకి వ్యతిరేకంగా నవంబర్ 26 నుండి రైతులు జాతీయ రాజధాని ఢిల్లీలోని సరిహద్దులలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news