ఏయిమ్స్‌లో 644 ఉద్యోగాలు… రేపే లాస్ట్ డేట్…!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) లో కొన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకు అప్లై చెయ్యవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పట్నా క్యాంపస్‌లో పలు విభాగాల్లో 644 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఇక పోస్టుల వివరాలు చూస్తే.. సీనియర్ ప్రోగ్రామర్, సీనియర్ డైటీషియన్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ (DMS), పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(PRO), యోగా వంటి నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులను పోస్టుల‌ ఆధారంగా పదో తరగతి, ఐటీఐ, 10+2, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా చేసి ఉండాలి.

ఈ పోస్టులకి మే 06న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభము అయింది. జూన్ 04వ తేదీతో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. కనుక రేపటి లోగా అప్లై చేసుకోవాల్సి వుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలని https://aiimspatna.edu.in/ లో చూసి అప్లై చెయ్యవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news