వైరల్ వీడియో:లాక్ డౌన్ లో బయటకు వచ్చారని పోలీసులు ఏం చేసారో చూడండి…!

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నా సరే ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. కేసులు రోజు రోజుకి భారీగా నమోదు అవుతున్నాయి. దీనితో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు లాక్ డౌన్ కూడా విధిస్తున్నాయి. పోలీసులు ఈ లాక్ డౌన్ ని కఠినంగా అమలు చేస్తూనే ఉన్నారు. ఇక చాలా మంది పదే పదే బయటకు రావడంతో పోలీసులు తమ చర్యలు తాము తీసుకుంటున్నారు.

తాజాగా హర్యానా రాష్ట్రంలో విధించిన లాక్‌ డౌన్‌ ను ఉల్లంఘించినట్లు గుర్తించిన వ్యక్తులను అంబాలాలోని పోలీసులు శిక్షించారు. ఈ రోజు ఉదయం రోడ్లపై సిట్-అప్‌ లు చేశారు. మే 10 వరకు హర్యానాలో 7 రోజుల పూర్తి లాక్డౌన్ విధించినా సరే ఉల్లంఘించిన వారిని పోలీసులు ఈ విధంగా శిక్షించారు.