బ్రేకింగ్: నేడు తెరాస సభ్యత్వానికి ఈటెల రాజీనామా…?

తెలంగాణాలో ఈటెల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మాజీ మంత్రి ఈటెల ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అని అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇటీవల ఆయనను మంత్రి వర్గం నుంచి పంపించిన సంగతి తెలిసిందే. ఇక అక్కడి నుంచి కూడా ఆయన నిర్ణయం ఏంటీ అనేది అర్ధం కావడం లేదు. ఇదిలా ఉంటే ఆయన తెరాస పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశాలు కనపడుతున్నాయి.etala-rajender

అభిమానుల కలిసి భవిష్యత్ కార్యాచరణ విషయంలో నేడు ఆయన దాదాపుగా నిర్ణయం తీసుకుంది. నేడో, రేపో ఎమ్మెల్యే పదవికి, టీఆరెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. హుజురాబాద్ నుంచే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. కొత్త పార్టీ పెట్టడం, ఇతర పార్టీలోకి వెళ్లడం, స్వాతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయడం అనే అంశంపై మద్దతు దారులతో ఈటెల చర్చిస్తారు. ఈటెల ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారు అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. టీఆరెస్ పై పోరుకు ఈటెల రెడీ అవుతున్నారు.