ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్లో సంచ‌ల‌నం: 7 బాల్స్  7 సిక్స‌ర్లు

-

అంత‌ర్జాతీయ క్రికెట్లో ప‌సికూన అప్గ‌నిస్తాన్ సంచ‌ల‌నం క్రియేట్ చేసింది. వ‌రుస సంచ‌ల‌న విజ‌యాల‌తో పెద్ద జ‌ట్ల‌కే షాక్ ఇస్తోన్న అప్ఘ‌న్ ఇటీవ‌లే టెస్ట్ హోదా కూడా పొందింది. ఇక ఈ యేడాది జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్‌కు సైతం అప్గ‌న్ ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ఇక టెస్ట్ హోదా పొందిన అప్గ‌న్ తాను ఆడిన మూడు టెస్టుల‌లో ఏకంగా రెండు విజ‌యాలు సాధించి పెద్ద జ‌ట్ల‌కే వ‌ణుకు పుట్టిస్తోంది.

ఇక అప్గ‌న్ ప్ర‌స్తుతం బంగ్లాదేశ్‌లో జింబాబ్వే, బంగ్లాదేశ్‌తో జ‌రుగుతోన్న 20-20 ముక్కోణ‌పు టోర్నీలో ఆడుతోంది. తాజాగా జ‌రిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ 28 పరుగులతో జింబాబ్వేను చిత్తుచేసింది. ముందుగా అఫ్గాన్‌ 5 వికెట్లకు 197 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్‌ (30 బంతుల్లో 69 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), మొహమ్మద్‌ నబీ (18 బంతుల్లో 38; 4 సిక్సర్లు) చెలరేగి 51 బంతుల్లో 107 పరుగులు జోడించారు.

ఈ జంట జింబాబ్వే బౌల‌ర్ల‌ను చిత్తు చిత్తు చేశారు. వీరిద్దరు కలిసి ఒక దశలో వరుసగా 7 బంతుల్లో 7 సిక్సర్లు బాదడం విశేషం. 17వ ఓవర్‌ చివరి 4 బంతులను నబీ సిక్సర్లు కొట్టగా…18వ ఓవర్‌ తొలి 3 బంతులను జద్రాన్‌ సిక్సర్లుగా మలిచాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఇలా వ‌రుస బంతుల్లో ఏడు సిక్స‌ర్లు కొట్టిన ఘ‌న‌త ఏ దేశ ఆట‌గాళ్ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు లేదు. అనంతరం జింబాబ్వే 7 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది.

Read more RELATED
Recommended to you

Latest news