ఆమె గర్భవతి కాదు..కానీ బాబు పుట్టాడు.. నమ్మలేని నిజం…!

అమెరికాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.  కార్లా అనే మహిళ 37 ఏళ్ళ మహిళ కొన్నేళ్లుగా పిల్లలు పుట్టడం కోసం తిరగని ఆసుపత్రి లేదు. కొలవని దేవుడు లేదు. ఆమెకి వయసు మీద పడుతోంది కానీ సంతానం మాత్రం కలగడం లేదు. అయితే ఒక రోజు ఊహించని పరిణామం ఆమె జీవితంలో చోటు చేసుకుంది. బహుశా ఇలాంటి సంఘటన జరిగిన మొట్టమొదటి మహిళ ఈమె అయ్యి ఉంటుందేమో..

కార్లా కొన్ని రోజుల క్రితం కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్ రూమ్ కి వెళ్ళింది. అయితే బాత్ రూమ్ లో ఉన్న సమయంలో ఒక్క సారిగా వెన్ను నొప్పి మొదలు అయ్యింది. సహజంగా వచ్చే బాధ అనుకున్న ఆమె పెద్దగా పట్టించుకోలేదు.కానీ అది అధికం అవ్వడంతో బాత్ రూమ్ తలుపు తెరచి బయటకి వెళ్తున్న క్రమంలో ఒక్క సారిగా పెద్దగా అరిచి తన వదినని పిలిచింది.

దాంతో కంగారు పడిన ఆమె వెళ్లి చూడగా కార్లా ఓ ఆడపిల్లకి జన్మని ఇవ్వడం చూసి షాక్ తిన్నారు. అసలు ఆమె గర్భం దాల్చిన విషయం ఆమెకి కూడా తెలియదని. అసలు వైద్యులు కూడా ఆమె గర్భవతి అనే విషయం చెప్పలేదని. కొన్నేళ్లుగా పిల్లలకోసం ప్రయత్నించినా ఫలితం లేదని. ఒక్క సారిగా ఈ సంఘటనతో షాక్ అయ్యామని సంతోషం వ్యక్తం చేశారు. అయితే బాబు బరువు చాలా తక్కువగా ఉన్నాడని, ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడని తల్లి కార్లా తెలిపింది. అదృష్టం ఎదురొచ్చి మరీ పలకరించడం అనే ఇదేనేమో…