పొట్టకూటి కోసం వృద్ధురాలు కర్రసాము. చూస్తే మతిపోతుంది..?

-

మనిషి ప్రతి నిమిషం కడుపు నింపుకోవడం కోసం పోరాటం చేస్తూనే ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఆకలి ఎలాంటి పనైనా చేయిస్తుంది. అందుకే మనిషికి అతిపెద్ద శత్రువు ఆకలి అని అభివర్ణిస్తూ ఉంటారు. తాజా ఘటన చూస్తే ఇది అక్షర సత్యం అని అర్థమవుతుంది, ఆమె 85 ఏళ్ల వృద్ధురాలు… కరోనా వైరస్ సమయంలో ఇంట్లో ఉండి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి..ఎందుకంటే ముందే వృద్ధురాలు కాబట్టి కరోనా వైరస్ బారిన పడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

కానీ ఆ వృద్ధురాలు మాత్రం అవన్నీ లెక్క చేయలేదు… కరోనా నేపథ్యంలో రోజురోజుకీ కుటుంబ పోషణ భారం అవుతున్న నేపథ్యంలో.. 85 ఏళ్ల వృద్ధురాలు కుటుంబ పోషణకు ముందుకు కదిలింది. అయోమయ పరిస్థితుల్లో తనకు తెలిసిన కర్రసాము ఉపయోగించి సహాయం కోరింది వృద్ధురాలు. తనకు తెలిసిన కర్రసాము చేస్తూ సహాయం చేయండి అంటూ అర్థించటం మొదలు పెట్టింది. 85 ఏళ్ల వయసులో ఆ వృద్ధురాలి కర్ర సాము ను కొంతమంది చూసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ భామ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news