వివేకా హత్య కేసు.. పులివెందులకు సీబీఐ..?

-

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య ఆంధ్ర రాజకీయాల్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఇంట్లో గుర్తుతెలియని దుండగులు ఆయనను అతి దారుణంగా హత్య చేశారు, అయితే వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలి అంటూ వివేకా కూతురు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది . ఈ నేపథ్యంలో ఇటీవల సిబిఐ దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక సిబిఐ ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నది.

హత్య కేసును ఛేదించడానికి సిబిఐ మరోమారు పులివెందులలోని వైఎస్ వివేక నివాసాన్ని పరిశీలించారు. పదిమందికి పైగా సీబీఐ అధికారుల బృందం హత్య జరిగిన ప్రాంతంలో క్షున్నంగా పరిశీలించారు. వివేక ఇంటికి వచ్చిన సీబిఐ అధికారులందరికీ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ వివేకా కూతురు సునీత దగ్గరుండి మరి చూపించారు. అంతేకాకుండా వివేకా హత్య జరిగినప్పుడు గది తలుపులు తెరుచుకుని ఉన్న విషయాన్ని కూడా సిబిఐ అధికారులకు వెల్లడించారు . అంతేకాకుండా హత్య జరిగిన సమయంలో ఇంటి బయట నిద్రిస్తున్న వాచ్ మెన్ రంగన్నను కూడా సిబిఐ అధికారులు విచారరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news