ఎన్నికల నోటిఫికేష్ విడుదలైన సందర్భంగా నియమావళిని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అన్ని పోస్టర్లు, కటౌట్లను 24 గంటల్లో తొలగించాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ ప్రదేశాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లను 72 గంటల్లోగా తొలగించాలని సూచించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్లకు తక్షణం ఆదేశాలు పంపుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వాహనాల వినియోగాన్ని నేతలు తక్షణం రద్దు చేసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సిబ్బంది మాత్రమే అధికారిక వాహనాలు వినియోగించవచ్చని తెలిపారు.