ఎన్నికల నగరా మోగింది…

-

మాటల తూటలతో ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం‌తో పాటే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నట్లు ఈసీ పేర్కొంది. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రాజస్థాన్ తో పాటు తెలంగాణలోనూ డిసెంబర్ 7న ఎన్నికలు నిర్వహిస్తామన్నారు

తెలంగాణలో  ఎన్నికల షెడ్యూల్ వివరాలు…

మొత్తం 119 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్‌: నవంబర్‌ 12
నామినేషన్లకు సమర్పణకు తుది గడువు: నవంబర్‌ 19
నామినేషన్ల పరిశీలన నవంబర్‌ 20
నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్‌ 22
పోలింగ్‌ తేదీ డిసెంబర్‌ 7
ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 11….

ఇదిలా ఉంటే… నేటి నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని వివరించారు. ప్రభుత్వ వాహనాలు,  ప్రభుత్వ ప్రచారానికి సంబంధించిన వాటిని 72 గంటల్లోగా తొలగించాలని ఈసీ  ఆదేశాలు జారీచేసింది.

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్.. అన్ని ఏర్పాట్లు చేసుకుని ముందస్తుకు సిద్ధమైంది. కేసీఆర్ కూడా వ్యూహాత్మకంగానే అసెంబ్లీని రద్దుచేసి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేశారు.  2019లో ఎన్నికలు జరిగినట్లయితే.. కాంగ్రెస్‌కు కాస్త పుంజుకునేందుకు అవకాశం ఉండేది. రాష్ట్రంలో బలంగా ఉన్నతెరాసను ఒంటరిగా ఎదుర్కోవడం కష్టమని తలచిన కాంగ్రెస్.. మహాకూటమిగా పోరాడేందుకు సిద్ధమవుతోంది.  ఇందులో భాగంగానే తెదేపాతో పొత్తుకూడా పెట్టుకున్న సంగతి తెలిసిందే..నేటి ప్రకటనతో తెలంగాణలో రాజకీయం మరింత హీటెక్కనుంది.

Read more RELATED
Recommended to you

Latest news