కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ నెల లో ఉద్యోగులకు ఇంకో సారి డీఏ పెరిగే అవకాశం ఉంది. ఇక పూర్తి వివరాలని చూస్తే.. సెప్టెంబర్ నెల లో ఉద్యోగులకు డీఏ 4 శాతం వరకు పెంచే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే కనీస భత్యంలో 42 శాతం ఉంది. ఒకవేళ అనుకున్నట్టే నాలుగు శాతం కనుక పెరిగిందంటే 46కు చేరవచ్చని చెబుతున్నారు.
నివేదికల ప్రకారం చూస్తే.. వచ్చే నెల అనగా సెప్టెంబర్ లో DA గురించి ప్రభుత్వం అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తోంది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ అలానే డీఆర్ సంవత్సరానికి రెండుసార్లు మారుస్తూ ఉంటుంది.
ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఇస్తారు. పెన్షనర్లకు డీఆర్ వర్తిస్తుంది. మే లో CPI IW ఆధారంగా ద్రవ్యోల్బణం 4.42 శాతం వుంది. అలానే జూన్ నెలలో ఇది 5.57 శాతానికి వెళ్ళింది. అనేక వస్తువుల ధరలు బాగా పెరిగాయి. సీబీఐ ఐడబ్ల్యూ ద్రవ్యోల్బణం పెరిగింది. అందుకే డీఏ రూ. 4% పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల లో ప్రకటించినా జూలై నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.