రాజస్థాన్ లోని చురు జిల్లా బిలియుబాస్ గ్రామంలోని ఒక గోశాలలో శనివారం ఏకంగా 80 ఆవులు చనిపోయాయి. అయితే ఈ ఆవులు ఎందుకు చనిపోయాయో తెలియడం లేదు. ఏదయినా విషాహారం తిన్నాయా ? లేక ఏదైనా వ్యాధి సోకిందా లేదా ఇతర కారణాల వల్ల మరణాలు సంభవించాయా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ విషయం మీద దర్యాప్తు చేస్తున్నామని అక్కడి తహశీల్దార్ కుతేంద్ర కన్వర్ చెబుతున్నారు.
ఆవులకు ఇచ్చిన ఆహారం యొక్క నమూనాలను పరీక్షల కోసం ఒక ప్రయోగశాలకు పంపామని ఆమె తెలిపారు. మన దేశంలో ఆవులను దేవుడిగా పూజిస్తారు. ఆవు నడిచే దేవుడని హిందువులు నమ్ముతారు. గోమాతగా భావించి అన్ని పర్వదినాల్లో వాటిని పూజించడం మనం చూస్తో ఉంటాం. అలాంటిది 80 ఆవులు చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఎందుకు చనిపోయాయి అనే విషయం బయటకు రావడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.