జైల్లో హెచ్ఐవి కలకలం : 85 మంది ఖైదీలకు పాజిటివ్ !

అస్సాం సెంట్రల్ జైలు, స్పెషల్ జైల్ లో హెచ్ఐవి కలకలం రేపింది. ఈ రెండు జైళ్లలో ఏకంగా 85 మంది ఖైదీలకు హెచ్ఐవి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ రెండు జైలులోని ఖైదీలు అందరికీ సెప్టెంబర్ మాసంలో హెచ్ఐవి టెస్ట్ చేశారు. అయితే ఈ టెస్టుల ఫలితాలు జైలు అధికారులు మరియు వైద్యులను ఆశ్చర్యపరిచాయి.

నగావు పట్టణంలోని ఈ జైలు లో మొత్తం 85 మంది హెచ్ఐవి పాజిటివ్ అని ఫలితాలు వచ్చాయని హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు స్పష్టం చేశారు. హెచ్ఐవి సోకిన వారంతా మాదకద్రవ్యాలు తీసుకున్నారని వైద్య వర్గాలు వెల్లడించాయి. అలాగే ఆ ఖైదీల అంతా డ్రగ్స్ కు బానిసలు అయ్యారని వివరించాయి.

ఆ మాదకద్రవ్యాలను ఎక్కించుకో డానికి వారంతా ఒకటే సిరంజిని వినియోగించి ఉంటారని…దీని కారణంగానే 85 మందికి హెచ్ఐవి వైరస్ సోకి ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే.. వైద్యుల సమాచారంతో.. ఈ 85 మంది ఖైదీలకు హెచ్ఐవి పాజిటివ్ తేలినట్టు వచ్చిన వార్తలపై సెంట్రల్ జైలు అధికారులు మీడియాకు కూడా ప్రకటన విడుదల చేశారు.