తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. నేటి నుంచి రాష్ట్రంలో ఉన్న రైతులకు రైతుబంధు పథకం డబ్బులు అకౌంటులో పడనున్నాయి. వచ్చే యాసంగి పంటకు సంబంధించి పెట్టుబడులకు గానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. రైతు బంధు డబ్బులు మొదట ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతలలో పడనున్నాయి. అనంతరం 2 ఎకరాల రైతుల అకౌంట్ లో పడుతాయి. దీని తర్వాత 2 నుంచి 3 ఎకరాలు ఉన్న రైతుల అకౌంట్ లో డబ్బు జమ కానుంది. ఇలా విస్తీర్ణం చొప్పున రైతుబంధు అమలు కానుది.
ఈ నెల 10 వ తేదీ నాటికి ధరణి పోర్టల్ లో పట్టాదారులు, కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా అందిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాదారులు రైతు బంధుకు అర్హులు కానున్నారు. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా 66,61 లక్షల మందికి రైతు బంధు నిధులు రానున్నాయి. అలాగే 152.91 లక్షల ఎకరాలకు సంబంధించి రూ. 7,645.66 కోట్లు రైతుల అకౌంట్ లలోకి జమ కానున్నాయి. ఇందులో 3.05 లక్షల ఎకరాలకు 94 వేల మంది రైతులు ఆర్ ఓఎఫ్ఆర్ పట్టాదారులు ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. అలాగే ఈ 8వ విడుదతతో రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతు బంధు ద్వారా రైతుల ఖాతాల్లోకి జమ అయిన మొత్తం రూ. 50 వేల కోట్లు.