లండన్ లోని సెవనోక్స్‌లోని ఇఘ్తామ్ ప్రాంతంలో ఒక పెద్ద పులి సంచరిస్తుంది. అక్కడి ప్రజలు బయటకు రావాలి అంటే భయపడుతున్నారు. వెంటనే సాయుధ దళానికి చెందిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. పది మంద పోలీసులు ఆ పులి ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. గాలింపు చేపట్టడానికి ఒక హెలికాప్టర్ ని కూడా సిద్దం చేసుకున్నారు. ఆ పులి ఉన్న ప్రాంతం మీద హెలికాప్టర్ తో చక్కర్లు కొట్టారు.
పులిని గుర్తించారు… హెలికాప్టర్ నుంచి పులి ఆనవాళ్ళు వాళ్లకు కనిపించాయి. శనివారం నాడు మరి కొంత మంది పోలీసులు కూడా పులిని పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. ఒక ఇంటి ముందు పులి ఉంది అనే విషయాన్ని గుర్తించి పోలీసులు దిగారు. ఆ పులిని నలువైపులా కమ్మేసారు. ఎలాంటి హడావుడి లేకుండా దాన్ని సమీపించారు పోలీసులు. నిదానం గా తుపాకులు వలతో దాని దగ్గరకు వెళ్లారు.
పులి కదలడం లేదు… అసలు ఏమైందో అర్ధం కాక ముందు రక్షణతో దాన్ని పట్టుకున్నాడు. పులి ఊగుతుంది. ఊగడం ఏంటీ అనుకున్నారు. అది పులి కాదు ఉత్తి బొమ్మ అని అర్ధమైంది. ఈ హడావుడి చూసి 90 ఏళ్ళ బామ్మ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. పోలీసుల హడావుడి చూసి నవ్వేసింది. ఏంటి బామ్మా నవ్వుతున్నావ్ అంటే అయ్యో అది నేను తయారు చేసిన పులి అండి నిజం పులి కాదు అని చెప్పింది. ఏం చెయ్యాలో తెలియక వచ్చేశారు పోలీసులు.