క్లాస్ లో బెంచ్ కోసం గొడవ… తుపాకితో కాల్చేసాడు

-

దిగ్భ్రాంతికరమైన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో ఆందోళన కలిగించింది. యుపి పాఠశాలలో ఒక చిన్న వివాదం గురువారం ఘోరమైన హత్యకు దారితీసిందని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. బులంద్‌ షహర్ జిల్లాలోని షికార్‌ పూర్ పట్టణంలోని సూరజ్ భన్ సరస్వతి ఇంటర్ కాలేజీకి చెందిన 14 ఏళ్ల 10 వ తరగతి విద్యార్థి సీటు వివాదంలో తన క్లాస్‌మేట్‌ను కాల్చి చంపాడు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, తరగతి గదిలోని ఒక సీటుపై ఇద్దరూ బుధవారం గొడవ పడ్డారు. మరుసటి రోజు, గురువారం, నిందితుడు పాఠశాలకు తుపాకీ తెచ్చాడు. అతను దానిని తన స్కూల్ బాగ్ లో దాచి పెట్టుకున్నాడు. స్కూల్ మొదటి రెండు సెషన్ లు ముగిసిన తరువాత, అతను తుపాకీని బయటకు తెచ్చి, తన క్లాస్‌మేట్‌ను రెండుసార్లు కాల్చాడు.

తుపాకీ కాల్పుల శబ్దం పాఠశాలలో భయాందోళనలను నెలకొన్నాయి. “బాలుడు ఘటన తర్వాత పాఠశాల నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు, కాని కొంతమంది ఉపాధ్యాయులు అతనిని పట్టుకున్నారు. అతనిని పోలీసులకు అప్పగించారు అని ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రభాత్ గుప్తా చెప్పారు. బులంద్‌షహర్ ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ పోలీసులు మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారని, ఆయుధాన్ని అదుపులోకి తీసుకున్నారని, ఇది బాలుడి మామకు చెందినది అని పేర్కొన్నాడు. “గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు, కాని దారిలోనే మరణించారు” అని బులంద్షహర్ సంతోష్ కుమార్ సింగ్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version