మహిళపై ఓ క్యాబ్ డ్రైవర్ వేధింపులకు పాల్పడిన కేసులో ఓలా సంస్థకు రూ.5 లక్షల భారీ జరిమానా విధిస్తూ కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2018 ఆగస్టులో ఓ మహిళ ఓలా రైడ్‌ను బుక్ చేసుకుంది. ఈ క్రమంలోనే క్యాబ్ డ్రైవర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని, బ్యాక్ వ్యూ మిర్రర్‌లో మహిళకు కనిపించేలా ఫోన్లో అశ్లీల చిత్రాలు చూస్తూ తన ముందే అసభ్యకరమైన చర్యలకు పాల్పడినట్లు పేర్కొంద. దీనిపై ఓలాకు ఫిర్యాదు చేయగా..ఆ డ్రైవర్‌ను బ్లాక్ లిస్టులో ఉంచామని,కౌన్సిలింగ్‌కు పంపుతామని సంస్థ తెలిపింది.
అయితే, డ్రైవర్‌పై తదుపరి చర్యల కోసం ఆమె పోలీసులను ఆశ్రయించగా..పోలీసులు పోష్ చట్టం కింద కేసు పెట్టారు. దీనిపై విచారణ జరపాలని జస్టిస్ ఎమ్‌జీఎస్ కమల్ కంపెనీ అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఆదేశించారు. 90 రోజుల్లో కోర్టు ముందు నివేదిక సమర్పించాలని కోరింది. దీనిపై ఓలా స్పందిస్తూ క్యాబ్ డ్రైవర్లు కంపెనీ ఉద్యోగులు కాదని, అందువల్ల పోష్ చట్టంలోని రూల్స్కు అనుకూలం కాదని ఐసీసీ ద్వారా తెలిపింది.ఐసీసీ నివేదికపై విచారణ జరిపిన ఓలా.. యాప్ డౌన్‌లోడ్ చేసే టైంలో కస్టమర్లకు భద్రత, రక్షణ ఒప్పంద హామీలు ఇస్తుందని, దీనిని ఉల్లంఘించినందుకు బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం కింద చెల్లించాలని ఓలా మాతృసంస్థ ఏఎన్ఐ టెక్నాలజీస్ ను ఆదేశించింది.వాజ్య ఖర్చుల కింద పిటిషనర్‌కు అదనంగా రూ.50 వేలు చెల్లించాలని జడ్జి ఎమ్‌జీఎస్ కమల్ తీర్పునిచ్చారు.