ముదిరిన వివాదం.. హీరో సూర్యపై పరువు నష్టం కేసు

తమిళ్ స్టార్‌ హీరో సూర్య ఇటీవల నటించిన చిత్రం జై భీమ్‌. ఈ సినిమా ఎంత బాగా హిట్‌ అయిందో… అదే స్థాయిలో ఈ సినిమా పై విమర్శలు వస్తున్నాయి. మొదట తమ భాష ను కించపరిచారంటూ.. నార్త్‌ ఇండియన్స్‌ ఫైర్‌ కాగా… ప్రస్తుతం వన్నియార్‌ సంఘం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా తమిళ నాడు చిదంబరంలోని కోర్టు లో హీరో సూర్య పై పరువు నష్టం దావా వేసింది వన్నియార్‌ సంఘం.

హీరో సూర్య సహా దర్శకుడు జ్ఙానవేల్‌, నిర్మాత జ్యోతిక, ఈ సినిమా ను ప్రదర్శించిన ఓటీటీ వేదిక అమెజాన్‌ పై సెక్షన్‌ 153, 153 ఏ, 499, 500, 503 504 ప్రకారం చర్యలు తీసు కోవాలని వన్నియార్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుథా అరుల్‌ మోళి తన ఫిర్యాదు లో పేర్కొన్నారు. జై భీమ్‌ సినిమా సభ్యులపై చర్యలు కచ్చితంగా తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమకు రాష్ట్రం లో న్యాయం జరుగకపోతే…. సుప్రీం కోర్టు కైనా వెళతామని హెచ్చరించారు.