భూమి వైపు వేగంగా దూసుకొస్తున్న తోకచుక్క…!

-

ఏదైనా తోకచుక్క భూమి వైపు దూసుకు రావడం అనేది చాలా అరుదుగా సంభవిస్తుంది. క్రితం రోజులలో హేలీ అనే ఓ తోకచుక్క భూమి వైపు చాలా వేగంగా దూసుకు వచ్చినట్టు చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం. ఇకపోతే తాజాగా మరో తోకచుక్క భూమిపైకి దూసుకు వస్తుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఆ తోకచుక్క బుధ గ్రహం కక్ష్య దాటి సూర్యుడి వైపు గా వెళ్ళకుండా అక్కడి నుంచి దిశ మార్చి భూమి వైపు వస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.

toka chukka
toka chukka

ఇకపోతే ఈ విషయాన్ని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లోని నియోవైజ్ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ తోకచుక్క ఏకంగా 5 కిలోమీటర్ల పొడవు ఉంటుందని, దానిని మనము కళ్లతో చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తోకచుక్క భూమి వైపు వచ్చే వారం ప్రయాణం చేస్తుందని, అలాగే ఈ తోకచుక్కను ఆకాశంలో సూర్యోదయం ముందు సూర్యాస్తమయం సమయం తర్వాతనే స్పష్టంగా కనపడుతుందని నాసా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. వారం రోజుల తర్వాత నుండి ఓ నెలరోజుల వరకు ఈ తోకచుక్క మనకు ఆకాశంలో కనిపిస్తుందని నిపుణులు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news