రామ్ గోపాల్ వర్మ తీస్తున్న పవర్ స్టార్ సినిమాపై పవన్ కళ్యాణ్ స్పందన ఇదే..!

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల కాలంలో ఎక్కువగా కాంట్రవర్సి కి కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడు. ఈ లాక్ డౌన్ సమయం లో 2 బూతుసినిమాలు తీసి బాగానే డబ్బులు దన్నుకున్నాడు కానీ కంటెంట్ లేని కథలతో ప్రేక్షకులను బాగా నిరుత్సాహ పరిచాడు. ఆ రెండు సినిమాల తర్వాత ఇంకొక 4 సినిమాలు ఒకేసారి పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నాడు రామ్ గోపాల్ వర్మ. హైదరాబాద్ నగరంలోనే ఈ నాలుగు చిత్రాల చిత్రీకరణ ఓకే స్టూడియోలో జరపనున్నట్లు సమాచారం. అయితే అతను తీస్తున్న మర్డర్, 12’O క్లాక్, కరోనా, పవర్ స్టార్ సినిమాల్లో పవర్ స్టార్ బయోపిక్ సినీ అభిమానులను బాగా ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు నాలుగైదు మూవీ స్టిల్స్ కూడా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు.

Power star movie poster
పవర్ స్టార్ సినిమాలో నటిస్తున్న ప్రధాన కథానాయకుడు బుక్స్ చదువుతూ, వ్యవసాయం చేస్తూ, ఆవులకి గడ్డి పెడుతూ, త్రివిక్రమ్ శ్రీనివాస్ ని పోలిన వ్యక్తిని కొడుతూ, చీర కట్టిన రష్యా ముద్దుగుమ్మ ముందు ఒక పుస్తకం చదువుతూ, చిరంజీవి లా కనిపించే వ్యక్తి పక్కన కూర్చొని బాధపడుతూ ఉన్నట్టు అనేక మూవీ స్టిల్స్ విడుదల చేశాడు రాంగోపాల్ వర్మ. పవర్ స్టార్ శీర్షికతో ఎన్నికల ఫలితాల తర్వాత కథ అనే ఉపశీర్షికతో పరోక్షంగా తాను ఎవరి గురించి, ఏ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాల గురించి సినిమా రూపొందిస్తున్నారో చెప్పకనే చెప్పేసాడు. పవర్ స్టార్ లోగో మధ్యలో కూడా ఒక గ్లాస్ గుర్తు పెట్టి అనేక చర్చలకు దారి తీశాడు.

Powerstar movie still
నిజానికి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గుర్తు గ్లాస్ కాగా… పవర్ స్టార్ అనేది పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఒక బయోపిక్ అని అందరూ భావిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ఒక్క మూవీ స్టిల్ కూడా పవన్ కళ్యాణ్ జీవన విధానాన్ని పోయినట్లే ఉండటం ప్రస్తుతం అనేక చర్చలకు దారి తీస్తుంది. పవర్ స్టార్ మూవీకి సంబంధించిన ప్రతి ఒక్క స్టిల్ తెగ వైరల్ అవుతుంది. ఐతే రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న పవర్ స్టార్ సినిమా పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్లిందట.

అయితే పవన్ కళ్యాణ్ రామ్ గోపాల్ వర్మ పై కొంచెం కూడా కోపం చూపించకుండా గట్టిగా 20 సెకండ్ల పాటు నవ్వి… అతను నా మీద ఏ సినిమా తీసినా పర్లేదు. మనమందరం ఈ సినిమా గురించి లైట్ తీసుకుందాం. ఒకవేళ మనమే మనము ఈ సినిమా గురించి ఏదైనా కామెంట్ చేస్తే ఆ సినిమాకి అనవసరంగా ప్రచారం చేసినట్లు అవుతుంది. రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఇటువంటి సినిమాలు రావడం సర్వసాధారణం. అప్పట్లో రాజకీయం లో అడుగుపెట్టిన ఎన్టీఆర్ పై కూడా ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. మొన్నీ మధ్య కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి చిత్రాలు తెరకెక్కాయి. ఇలాంటి సినిమాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది’, అని చాలా శాంతంగా పవన్ కళ్యాణ్ స్పందించారట.