ముఖ్యమంత్రి నివాసంలో కరోనా కల్లోలం…!

-

కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం అల్లకల్లోలం అయింది. ఈ కోవిడ్ మహమ్మారి ఎప్పుడు ఎవరికి సోకుతుందో తెలియడం లేదు. అయితే బీహార్‌లో మాత్రం కేసులు రోజురోజుకు పెరుగుతునే ఉన్నాయి.ఈ వైరస్ ప్రభావం ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసాన్ని కూడా తాకింది. ముఖ్యమంత్రి నివాసం, క్యాంప్ కార్యాలయంలో పనిచేస్తున్న 80 మందికి పైగా సిబ్బంది కరోనా వైరస్ కు గురైనట్లు సమాచారం. రెండు రోజుల కిందటనే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మేనకోడలు కరోనావైరస్ భారిన పడ్డారు. దాంతో ఆమె పాట్నా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను నిర్బంధంలో ఉంచారు.

nitish
nitish

ఇక ఇటీవల సీఎం అంతర్గత భద్రతా వివరాల సభ్యుడు డిఎస్పి సంతోష్ కుమార్ కు పాజిటివ్ రావడంతో.. నితీష్ కుమార్ కు కూడా కరోనా పరీక్షలు చేశారు. అయితే ఆయనకు నెగటివ్ వచ్చింది. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నదని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు. అలాగే పాట్నా మెడికల్ కాలేజీ, హాస్పిటల్ లో ముగ్గురు వైద్యులు, ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో పీఎంసీహెచ్‌లో కరోనా పాజిటివ్ ఉద్యోగుల సంఖ్య 44 కు పెరిగింది. ముఖ్యమంత్రి నివాసంలోని 80 మందికి పైగా సిబ్బందికి కరోనా సోకడంతో కలకలం రేగింది. అలాగే కార్యాలయ కార్యదర్శి డ్రైవర్ కు కరోనా సోకినట్లు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news