పెళ్లీడుకొచ్చిన కొడుకుని పెట్టుకుని.. అతడితో రొమాన్స్ చేస్తున్న ప్రముఖ హీరోయిన్..!

-

ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్లు మొదట ప్రేమించడం.. వివాహం చేసుకోవడం ఆ తర్వాత మనస్పర్ధలు రాగానే విడాకులు తీసుకోవడం.. ఇంకొకరితో సహజీవనం చేయడం లాంటివి ఎక్కువగా చేస్తున్నారనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పెళ్లీడు కొచ్చిన కొడుకుని పెట్టుకుని మరొకరితో ఎఫైర్ పెట్టుకుంది . అయితే ఈ విషయం కొడుకుకు తెలియకుండా జాగ్రత్త పడడం మరొక ఎత్తు.. అయితే ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ హా.. ఇదేం పోయేకాలం.. పెళ్లీడుకొచ్చిన కొడుకుని పెట్టుకుని అలా ఇంకొకడితో ఎఫైర్ గుట్టుగా కొనసాగిస్తూ ఉండడం ఇదేం బుద్ధి అంటూ రకరకాలుగా ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

 

అయితే ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే.. ఒక స్టార్ హీరో సోదరుడితో మొదట్లో ప్రేమలో పడి వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అతనితో వివాదాలు తలెత్తడంతో కొడుకు జన్మించిన తర్వాత బ్రేకప్ అయ్యింది. విడాకులు తీసుకొని కొంతకాలం దూరంగా ఉన్న ఈమె ఆ తర్వాత ఒక యంగ్ హీరోతో డేటింగ్ చేస్తూ సహజీవనం కూడా చేసింది. అంతేకాదు ఇద్దరూ కలసి లొకేషన్స్ కి , పార్టీలకు, ఫంక్షన్స్ కు వెళ్తూ చట్టా పట్టాలేసుకొని తిరుగుతూ మీడియా కంట పడ్డారు. దీంతో వీరి గుట్టు కాస్త బట్ట బయలు అయిందని చెప్పాలి.

ఇకపోతే ఈ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ తనకంటే చిన్నవాడైన యంగ్ హీరోతో సహజీవనం చేస్తూ ఉండడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వయసు 50 కి చేరువలో ఉన్న నేపథ్యంలో ఇలా యంగ్ హీరోతో సహజీవనం చేస్తూ ఎఫైర్ కొనసాగించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి గురించే ట్రెండింగ్ టాపిక్ నడుస్తూ ఉండడం గమనార్హం. అయితే కొంతమంది కొత్త లైఫ్ ని మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నందుకు ఆల్ ద బెస్ట్ అని చెబుతుంటే.. మరికొంతమంది ముసలి వయసులో నీకు పెళ్లి అవసరమా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంపై ఈ జంట ఎలా స్పందిస్తుందో తెలియాలి.

Read more RELATED
Recommended to you

Latest news