రైతు బిడ్డని, బిట్స్‌ పిలానీలో గోల్డ్‌ మెడలిస్టుని : ఏనుగుల రాకేశ్‌ రెడ్డి

-

తనను గెలిపిస్తే ప్రజల సమస్యలపై పోరాడతానని,ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తానని వరంగల్‌- నల్గొండ-ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్‌ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌ రెడ్డి హామీ ఇచ్చారు.వరంగల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… విద్యావంతులు, మేధావులు భవిష్యత్‌ గురించి ఆలోచించి తీర్పు ఇవ్వాలని ,తెలంగాణ ప్రజలకు మంచి కోసం మేధావులు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

దేశంలో చట్టసభలకు గొప్ప గొప్ప మేధావులు వెళ్లారని, ఇప్పుడు ద్రోహులు, బ్లాక్‌ మెయిలర్లు పోటీ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉద్యోగులు ఎలాంటి బెదిరింపులు లేకుండా పనిచేయాలని, ప్రశాంతంగా ఎవరి వ్యాపారాలు వారు చేసుకోవాలని.., దీనికి కోసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపాలని ఏనుగుల రాకేశ్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజల తరఫున ప్రశ్నించే వారెవరు? ప్రభుత్వానికి తొత్తులుగా మారెవారెవరు అనేది గ్రహించాలని తెలిపారు. తాను రైతు బిడ్డనని, బిట్స్‌ పిలానీలో గోల్డ్‌ మెడలిస్టునని అన్నారు. అమెరికాలో ఏడేండ్లు ఉద్యోగం చేశానని, పుట్టినగడ్డ రుణం తీర్చుకునేందుకు సేవ చేసేందుకు ఇక్కడికి వచ్చినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news