రేపు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్… రెండు కోట్ల పందెం వేసిన ర్యాపర్

-

రేపు చెన్నైలోనే చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్ల ఫైనల్ మ్యాచ్ ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠ గా ఎదురు ఇక రేపు ఈ జట్టు గెలుస్తుంది అనే దానిపైన దేశవ్యాప్తంగా జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఇక రేపటి ఐపీఎల్ ఫైనల్ పోరుపై ఆయా జట్ల అభిమానులు వేల మొదలు లక్షల వరకూ పందెం కాస్తున్నారు. తాజాగా, ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలోకి ఓ ర్యాపర్ దిగాడు.

రేపు జరిగే ఫైనల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టు విజయం సాధిస్తుందని గ్రామీ అవార్డు విజేత కెనడియన్ ర్యాపర్, సింగర్ డ్రేక్ సుమారు రూ. 2.07 కోట్లు(250,000 USD) పందెం వేశాడు. పందెం వివరాలను అతను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు.డ్రేక్ ఏదేని క్రికెట్ మ్యాచ్‌పై పందెం వేయడం ఇదే తొలిశారట. అతను కోల్‌కతా గెలుస్తుందని చాలా నమ్మకంగా ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… రేపు వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే.. 27 న మ్యాచ్ ఉంటుంది. ఒకవేళ ఆ రోజు కూడా వర్షం తగ్గకపోతే లీగ్ స్టేజీలో అత్యధిక పాయింట్లతో ఉన్న జట్టు ట్రోఫీ విజేతగా నిలుస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news