వాట్సాప్‌లో త్వరలోనే అదిరిపోయే ఫీచర్.. గెట్ రెడీ టు వాచ్!

-

తన వినియోగదారు కోసం వాట్సాప్ కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. అప్డేట్స్ ద్వారా తన మార్కెట్‌ను పెంచుకోవడంతో పాటు వినియోగదారులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇవి మరి అంత పెద్ద అప్టేడ్స్ కాకపోయినా యూజర్స్ మాత్రం అద్బుతమైన ఫీల్ పొందుతున్నారు. వాట్సాప్‌లో ఇప్పటికే ఏఐ ఫీచర్ అప్డేట్ అయ్యింది. న్యూస్ చానెల్స్, సెలబ్రిటీల చానెల్స్ కూడా చూపిస్తోంది. స్టేటస్ అప్డేట్స్ కూడా ఇస్తోంది.

తాజాగా ఇన్ స్ట్రాగ్రామ్ స్టోరీస్ తరహాలో వాట్సాప్ స్టేటస్ లకు వీడియో సాంగ్ కాకుండా కేవలం సాంగ్ యాడ్ చేసుకునే ఫీచర్ను వాట్సాప్ త్వరలో తీసుకురానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్ హెడ్ కార్ల్ పూగ్ తెలిపారు. అదేవిధంగా స్టేటస్ లలో ఫ్రెండ్స్ కాంటాక్ట్స్‌ను ట్యాగ్ చేసే ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్లు డెవలప్ మెంట్‌ దశలో ఉన్నాయని, అందుబాటులోకి వచ్చాక అధికారికంగా ప్రకటన చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version