చైనాకు చెక్ పెట్టేందుకు ఒక్క‌టైన ఆ నాలుగు దేశాలు

-

స‌రిహ‌ద్దుల్లో క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూ ఉద్రిక్త‌త‌లు రాజేస్తున్న డ్రాగ‌న్ కంట్రీకి భ‌విష్య‌త్‌లో మూకుతాడు ప‌డ‌నుందా..! అంటే ఈ మ‌ధ్య జ‌రుగుతున్న ప‌రిణ‌మాలు అవున‌నే స‌మాధానం ఇస్తున్నాయి.
సామ్రాజ్య‌వాదంతో విర్రవీగుతూ ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అశాంతిని సృష్టిస్తున్న చైనాకు చెక్‌ పెట్టేందుకు ఆ నాలుగు దేశాలు చేతులు కల‌ప‌డం ఇదే విష‌యాన్ని తేట‌తెల్లం చేస్తున్న‌ది. చైనా దూకుడును అడ్డుకొని ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణం నిలిపేందుకుగాను అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాలు ఒక్క‌ట్ట‌య్యాయి. చైనా ఆగ‌డ‌లాకు అడ్డుక‌ట్ట వేయ‌డ‌మే ల‌క్ష్యంగా స్నేహ‌హ‌స్తం అందించాయి.

స‌రిహ‌ద్దుల్లో శాంతిస్థాప‌న కోసం ఈ నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు ముఖాముఖి సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులు ఎస్‌ జైశంకర్‌, తొషిమిట్సు మొటెజి, మరైస్‌ పేన్‌లతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జపాన్‌ కొత్త ప్రధాని యొషిహిడే సుగా మాట్లాడుతూ ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా సంక్షోభంకన్నా తమకు ప్రస్తుతం ఇండో-పసిఫిక్‌లో శాంతి సుస్థిరతలే అత్యంత కీలకమని స్పష్టంచేశారు. జైశంకర్‌ మాట్లాడుతూ వైభవోపేతమైన, బహుళత్వం కలిగిన మన ప్రజాస్వామ్య దేశాలు ఇండో-పసిఫిక్‌ను స్వేచ్ఛాయుత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కలిసికట్టుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news