BREAKING: నేరేడుమెట్ లో దారుణం..బాలికపై 5 గురు గ్యాంగ్ రేప్

-

BREAKING: నేరేడ్మెట్ లో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు. మైనర్ అమ్మాయిని ట్రాప్ చేసి నేరేడ్మెట్ తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్ పాల్పడ్డారు యువకులు. కాచిగూడ లో ఉంటున్న మైనర్ అమ్మాయిని కి గంజాయి అలవాటు చేశారు యువకులు. మైనర్ అమ్మాయి గంజాయి మత్తులోకి దిగగానే అత్యాచారం చేశారు యువకులు. జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పకుండా దాచిపెట్టింది ఆ మైనర్ అమ్మాయి.

A girl was gang-rped by 5 people

ఇక మైనర్ అమ్మాయి శరీరంలో మార్పులు రావడంతో గమనించి నిలదీసింది తల్లి. అనంతరం జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించింది మైనర్ బాలిక. దీంతో కాచిగూడ పోలీస్ స్టేషన్ లో బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు… నేరేడ్మెట్ కు బదిలీ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన యువకుల కోసం గాలిస్తున్న పోలీసులు…వెంటనే పట్టుకుంటామని చెబుతున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version