దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండియా కాదు టాక్ ఆఫ్ ద వరల్డ్ గా మారిపోయింది. విదేశీ గడ్డమీద తెలుగు సినిమా తన పథకాన్ని ఎగురవేస్తోంది. ప్రపంచ సినిమాల్లో పేరు పొంది.. అవార్డులను గంపగుత్తగా పట్టుకునే పనిలో పడింది ఈ చిత్రం. అయితే ప్రపంచంలో అత్యుత్తమంగా భావించే అవార్డుకు నామినేట్ కాకపోవడమే ఇప్పుడు సినీవర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు రాజమౌళి పెట్టుకున్న ఆశలపై ఒక గుజరాతీ సినిమా నీరు చల్లిందని చెప్పవచ్చు.
అసలు విషయంలోకి వెళితే.. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ బరిలో దూకడానికి ప్రయత్నిస్తుండగా గుజరాతీ సినిమా చెల్లో షో నీరు జల్లింది ఆర్ ఆర్ ఆర్ సినిమాకు అడ్డుపడింది… ఆర్ఆర్ఆర్ నుంచి వస్తున్న పోటీని తట్టుకొని చెల్లో షో ఆస్కార్ కి నామినేట్ కావడం దేశీయ సినీ పండితులను ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇకపోతే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున కాకుండా ఆస్కార్లో నామినేషన్ కు కావలసిన అర్హతలను వ్యక్తిగతంగా సంతృప్తి పరుస్తూ అకాడమీ అవార్డుల రేసులో సాగుతోంది.
ప్రపంచ సినిమా గుర్తింపు కోసం ప్రతి గడప ఎక్కడానికి ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఆస్కార్ గెలుచుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలను ప్రారంభించారు. కానీ ఇలా ఉన్నట్టుండి ఆస్కార్ నామినేషన్లో చోటు సంపాదించుకోకపోవడం నిజంగా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్, అజయ్ దేవగన్, ఆలియా భట్ తదితరులు నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూల్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగానే వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఆస్కార్ కి నామినేట్ కాకపోవడం మరింత ఆందోళనకు గురి చేస్తోందని చెప్పవచ్చు.