లోకంలో కరోనా సృష్టిస్తున్న అరాచకాలు మామూలుగా లేవు.. ఈ వైరస్ వచ్చిన వారికి బ్రతికుండగానే నరకాన్ని చూపిస్తుందనుకుంటే, మరణించాక కూడా ముప్పతిప్పలు పెడుతుంది.. ప్రభుత్వాలు కరోనా బారినుండి, మీ ప్రాణాలు మీరే కాపాడుకోండని చెబుతున్నా వినేవారు ఎవ్వరు.. ఎక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ సరిగ్గా పాటించడం లేదు.. ఇకపోతే కరోనాతో మరణించిన ఒక వ్యక్తి వల్ల వారి బంధువులు ఎన్ని పాట్లు పడ్డారో.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో వెలుగు చూసింది.. ఆ వివరాలు తెలుసుకుంటే..
ఘాజియాబాద్‌లో కరోనాతో ఇటీవల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, అంత్యక్రియల కోసం అతని శవాన్ని ప్యాక్ చేసి బంధువులకు అప్పగించారు. ఈ క్రమంలో మృతుని బంధువులంతా విద్యుత్ కిమెటోరియంలో దహనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక అంతా సిద్దం అనుకుని ఆ శవాన్ని లోపలికి పంపించగా, అతని దేహం సగం కాలిన తర్వాత మధ్యలోనే కరెంట్ పోయింది. ఇలా అర్ధాంతరంగా దహన సంస్కారాలు నిలిచిపోవడంతో అక్కడ ఉన్న వారంతా ఆయోమయంలో పడిపోయారు. ఎందుకంటే వీరి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి అయితే కానీ భోజనం చేయడం ఉండదట. ఇక సమయం మించిపోతుంది ఎంతగా ఎదురు చూసిన కరెంట్ రాదు.. అలా వీరంతా సగం కాలిన శవంతో ప్రాణాలు నీరసించి పోతున్న ఎదురుచూస్తూనే ఉన్నారట..
చివరికి 29 గంటల తర్వాత విద్యుత్ రావడంతో అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. కానీ విద్యుత్ కిమెటోరియం అధికారుల పని తీరుపై మృతుని బంధవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేసి గంటలు శవాన్ని పట్టుకుని శ్మశానంలో తిండితిప్పలు లేకుండా ఉండటం మామూలు విషయం కాదు.. మరి ఈ విషయంలో అక్కడి ఉన్నతాధికారులు ఎలా స్పందించారో..