మహిళలపై అత్యాచారాలు ఆకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో భార్యాపట్ల భర్త దారుణంగా ప్రవర్తించాడు. భార్య ప్రైవేట్ పార్టులో ఫెవిక్విక్ ని పెట్టాడు. మధ్యప్రదేశ్ లోని షియోపూర్ లోని కోత్వాళీ పోలీస్ స్టేషన్ లో ఒక అవమానకరమైన సంఘటన తేరపైకి వచ్చింది. అంతేకాకుండా భార్య చేతులు, కాళ్ళను ముందుకు కట్టి క్రూరుడిగా మారాడు.
అంతేకాదు భార్య ప్రైవేట్ పార్ట్ లో స్టిక్కీ పదార్థమైన ఫెవిక్విక్ ను భర్త పెట్టాడు. దీంతో భార్య కేకలు వేయడం ప్రారంభించింది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో డ్రగ్స్ కు బానిసైన ఆ వ్యక్తి మత్తులో ఉండేందుకు గాను భార్య వద్ద తరచూ డబ్బులు అడిగేవాడని తేరింది. ఆమె డబ్బులు లేవని చెప్పడంతో ఈ ఆకృత్యానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్తున్నారు.