అమెరికాలో టిక్ టాక్ ఎవరు కొనుక్కునే అవకాశం ఉంది అనే దానిపై మైక్రో సాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. టిక్ టాక్ యాజమాన్య సంస్థ బైట్ డ్యాన్స్ తమను అసలు వద్దు అనుకుంది అని మైక్రో సాఫ్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికాలోని టిక్‌టాక్ కార్యకలాపాలను మాకు అమ్మేది లేదంటూ బైట్‌డ్యాన్స్ మాకు సమాచార మిచ్చింది’ అని మైక్రోసాఫ్ట్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
మేమిచ్చిన ఆఫర్ టిక్‌టాక్ యూజర్లకు ఎంతో ఉపయోగకరమని మేము ఇప్పటికీ నమ్ముతున్నామని సాఫ్ట్ వేర్ దిగ్గజం పేర్కొంది. దీని ఆధారంగా చూస్తే టిక్ టాక్ ని ఒరాకిల్ కొనే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. దీనిపై టిక్ టాక్ నుంచి ఏ ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. ఒకవేళ టిక్ టాక్ ని మాకు విక్రయించి ఉంటే చాలా జాగ్రత్తగా నిర్వహించే వాళ్ళం అని పేర్కొంది.