జాతి మొత్తం వారితోనే ఉంటుంది: మోడీ

పార్లమెంట్ తో పాటుగా సభ్యులు, అలాగే దేశం మొత్తం ఆర్మీతోనే ఉంటుంది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పార్లమెంట్ సమావేశానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ పార్లమెంటు మరియు సభ్యులందరూ… దేశం మన సైనికుల వెనుక నిలుస్తుందనే సందేశాన్ని పంపుతుందని నేను ఆశిస్తున్నా అంటూ మోడీ వ్యాఖ్యానించారు. మన సైనికులు తమ మాతృ భూమిని కాపాడుకోవటానికి చాలా ధైర్యంతో అలాగే అభిరుచి మరియు ధృడ నిశ్చయంతో సరిహద్దుల వద్ద నిలబడి ఉన్నారని మోడీ అన్నారు.

వారు ఎంతో కష్టతరమైన ఎత్తులో నిలబడ్డారని ఆయన పేర్కొన్నారు. కొద్ది రోజుల్లో మంచు వాతావరణం ఉంటుందని చెప్పారు. అదే విధంగా, పార్లమెంటు మొత్తం, ఒకే స్వరంతో… మేము మా సైనికుల వెనుక గట్టిగా ఉన్నాం అనే సందేశాన్ని పంపండి “అని ప్రధాని అన్నారు. చైనా సరిహద్దుల్లో ఉన్న అర్మీని ఉద్దేశించి మోడీ ఈ వ్యాఖ్య చేసారు.