ఆస్ట్రేలియాతో 100 మీటర్ల భారీ సిక్సర్.. సీక్రెట్ చెప్పిన రింకూ..!

-

టీమిండియా నయా బ్యాటింగ్ సంచలనం రింకూ సింగ్ మరోసారి దుమ్మురేపాడు. రాయ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 లో రింకూ అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో 29 బంతులు ఎదుర్కొన్న రింకూ నాలుగు ఫ్లోర్లు, రెండు సిక్స్ లతో 46 పరుగులు చేశాడు. కాగా శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ వంటి కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన రింకూ తన అద్భుత ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకున్నాడు. ఇండియా 174 పరుగులు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

అయితే ఈ మ్యాచ్ లో రింకూ కొట్టిన సింగ్ ఓ సిక్సర్ ఏకంగా 100 మీటర్ల దూరం వెళ్ళింది. దీంతో ఈ సిరీస్ లో భారీ సిక్సర్ కొట్టిన ఆటగాడిగా రింకూ నిలిచాడు. కాగా మ్యాచ్ అనంతరం తన పవర్ ఫిట్టింగ్ కు గల సీక్రెట్ రింకూ బయటపెట్టాడు. రోజు వ్యాయామం చేయడం, మంచి ఆహారాన్ని తీసుకోవడమే తన బలానికి కారణమని రింకూ తెలిపాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత బీసీసీఐ టీవీతో రింకూ సింగ్, జితేష్ శర్మ మాట్లాడారు. ఈ క్రమంలో జితేష్ నీ పవర్ ఫిట్టింగ్ కు గల కారణమేంటి అని ప్రశ్నించాడు. నేను నీతో కలిసి జిమ్ చేస్తున్నాను. మంచి ఫుడ్ తీసుకుంటున్నాను. బరువులు ఎత్తడం కూడా నా ఇష్టం. అందుకే సహజంగా నాలో అంత పవర్ ఉంది అని నవ్వుతూ రింకూ సమాధానమిచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news