టీడీపీ అధినేత చంద్రబాబు రాకతో పార్టీ శ్రేణులతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాలు శుక్రవారం చాలా సందడిగా మారిన సంగతి తెలిసిందే. తిరుపతి నుంచి చంద్రబాబు చేరుకున్న ఇండిగో విమానంలోనే మంత్రి రోజా కూడా వచ్చారు. విమానాశ్రయం బయటకు వచ్చే ప్రయాణికుల ద్వారా టీడీపీ శ్రేణులు భారీగా ఉండడంతో ప్రత్యేక లాంజ్ ద్వారా మంత్రి రోజాను పోలీసులు బయటకు పంపారు. విశాఖపట్నం విమానాశ్రయంలో జన సైనికులు ఉన్న సమయంలో మంత్రి రోజాను పంపడంతో తలెత్తిన సంఘటన పునరావృతం కాకుండా ప్రత్యేక లాంజ్ నుంచి మంత్రి రోజాను పంపినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
మరోవైపు తిరుపతి సర్వీసు విమానాశ్రయం చేరుకునే 10 నిమిషాల ముందు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమానాశ్రయం చేరుకున్నారు. రోడ్డు మార్గంలో పవన్ కళ్యాణ్ మంగళగిరి తరలి వెళ్ళగా.. మంత్రి రోజా విజయవాడ బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్‌లో ఓటు పెట్టుకుని ఇక్కడ ఆడతాం అంటే కుదరదని మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.