ఈ రోజు బెంగుళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో వర్షం కారణంగా ఛేదనలో పూర్తి ఓవర్లు సాధ్యం కాకపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్దతిలో పాకిస్తాన్ పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మొదట కివీస్ బ్యాటింగ్ చేసి పాకిస్తాన్ ముందు అనితర సాధ్యం కానీ లక్ష్యాన్ని ఇచ్చి ఛాలెంజ్ విసిరింది, ఈ మ్యాచ్ లో కనుక పూర్తి ఓవర్లు సాధ్యం అయి ఉంటే న్యూజిలాండ్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉండేవి.. కానీ సడెన్ గా ఇన్నింగ్స్ లో రెండు సార్లు వర్షం పడడం.. సమయం మించి పోతుండడంతో అంపైర్లు విజేతని డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ప్రకటించడానికి మొగ్గుచూపారు. పాకిస్తాన్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 25 .3 ఓవర్లలో 200 పరుగులు చేసింది. వాస్తవంగా అయితే ఆ సమయానికి పాకిస్తాన్ కేవలం 179 పరుగులు చేస్తే విజయం సొంతం అయ్యేదే.
కానీ పాకిస్తాన్ ఫఖార్ జమాన్ చాల జోరుగా ఆడుతూ ఎప్పుడూ కొన్ని పరుగులను అధికంగానే చేసి ఉంచాడు. అందుకే పాక్ కు విజయం చాలా సులభం అయింది. ఈ విజయంతో న్యూజిలాండ్ కు సెమీస్ కు వెళ్లడం కొంచెం కష్టమయ్యేలా ఉంది.